Bodhan: Testimony of mediaeval Islamic bigotry and its continuation

  • News

మధ్యయుగాల ఇస్లాం విధ్వంసానికి సజీవ సాక్ష్యం –  దేవల్ మసీదు

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా లోని బోధన్ ప్రాచీన పట్టణం. పట్టణానికి గొప్ప చరిత్ర ఉంది. పట్టణం లోని వేల సంవత్సరాల నాటి ఇంద్ర నారాయణ దేవాలయాన్ని నూరు స్తంభాల గుడి అని  పిలుస్తుంటారు. దక్కన్ ఇస్లామిక్ ఆక్రమణలో భాగంగా నాటి ఖిల్జి వంశస్థుడైన మహమ్మద్ బిన్ తుగ్లక్  కాకతీయ వారసత్వ రాజధాని  వరంగల్ కోట పై 1323లో దాడికి దిగాడు. దాడిలో ఇంద్ర నారాయణ గుడిని మార్చేసి  మసీదుగా తయారు చేశాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో భాగంగా పైకప్పును మాత్రం మార్చి డోములు నిర్మించాడు, కానీ అడుగు భాగంలోని నక్షత్ర  రూపంలో ఉన్న మూల  నిర్మాణాలు అలాగే ఉండి పోయాయి.తెలంగాణ ప్రభుత్వం  దీన్ని అధికార  రికార్డుల్లో  “దేవల్ మసీదుగా  గుర్తించిందే తప్పదేవాలయంగా పరిగణించలేదు. “దేవల్అనే పదం ఇది హిందూ దేవాలయం అనే  విషయాన్ని రుజువు చేస్తోంది. దేవాలయంలోని విగ్రహాలను తొలగించి, గోడలకు ఉన్న అద్భుతమైన శిల్ప సౌందర్యాలను ధ్వంసం చేశారు. అందులో ఒక వేదికను నిర్మించారు. స్థల ఆవరణలో రోజుకి  కొన్ని ముస్లిం సమాధులు కూడా ఉన్నాయిశిథిలమైన  దీన్ని తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది

దేశానికి 1947 లో స్వాతంత్ర్యం వచ్చింది కానీవందల సంవత్సరాల విదేశీ పాలకుల  సాంస్కృతిక అణిచివేత నుంచి మనం ఇంకా బయటపడలేదు. దీనికి ఇంద్ర నారాయణ దేవాలయం దుస్థితి ఒక నిదర్శనం. హిందువులు, వారి దేవాలయాలపై ఇస్లాం ఆక్రమణదారుల కొనసాగించిన హింసకు ఇప్పటికీ దేవాలయం ఒక సజీవ తార్కాణంగా దర్శనమిస్తుంది. విధ్వంసానికి గురైన స్థలాలను పునరుద్ధరించకపోతే స్వాతంత్రం అనే స్ఫూర్తికి అర్థం లేదు. దాడులను ప్రజల హక్కుల పై జరిగిన హింస గా  పౌరహక్కుల నేతలు గుర్తించాలి, అయితే దేవల్ మసీదును హిందుత్వంపై ఇస్లాం దాడి గా కాకుండాసాంస్కృతిక సంగమంగా మేధావులు దీనిని అభివర్ణించడం వారి ఆత్మ వంచన కుదివాలా కోరుతనానికి  నిదర్శనం.

నియంతలు, రాక్షస పాలకుల విగ్రహాలను ప్రజలే ధ్వంసం చేసి , తాము గతంలో పోగొట్టుకున్న  ప్రతిష్టనుఆచారాలను నిలబెట్టుకోవడమే నేటి ఆధునిక చరిత్ర. ప్రజలపై వారి సంస్కృతిపై దాడులు చేసిన హిట్లర్, స్టాలిన్, సద్దాం హుస్సేన్, గడాఫీ లాంటి ఎందరో ఎందరో విగ్రహాలను ప్రజలు కూలదోసి తమ స్వేచ్ఛను, జాతీయతను చాటుకున్న ఘటనలు ఆధునిక చరిత్రలో మైలు రాళ్ళుగా నిలిచిపోయాయి. భారత దేశ చరిత్రలో అనేక మంది విదేశీ దురాక్రమణ దారులు వలస వచ్చి ప్రజల పై దాడులకు దిగారు. తొలుత ఇస్లామిక్ ఆక్రమణదారులు, బ్రిటీషర్లు దేశాన్ని ఆక్రమించి విధ్వంసానికి పాల్పడ్డారు. గజిని, ఖిల్జీ, తుగ్లక్, తైమూర్ లాంటి అనేక మంది ఇస్లాం పాలకులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి వేలాది మందిని ఊచకోత కోశారు. బ్రిటిష్ దురాక్రమణ దారులు కరువు కాటకాలను సృష్టించి వేలాది మంది ఉసురు తీశారు. భారతీయ సంపదను దోచుకున్నారు

ప్రపంచ దేశాల్లో హిట్లర్, సద్దాం హుస్సేన్ లాంటి వారి విగ్రహాలను పెకలించి నప్పుడు రాబర్ట్ క్లైవ్ విగ్రహాన్ని తొలగించడం, ఔరంగజేబు రోడ్డు పేరు మార్చడం ఎలా  అన్యాయం అవుతుంది? జలియన్ వాలా బాగ్ లో వందలాది మందిని చంపిన జనరల్ డయ్యర్రాణి పద్మావతి జోహార్/ ఆత్మాహుతికి కారణమైన అల్లావుద్దీన్ ఖిల్జీ  పేర్లను రోడ్లకు నామకరణం  చేయడానికి ఎవరైనా అంగీకరిస్తారా ?

లౌకికవాదం, బహుళత్వం  అంటే పాత గాయాలను మర్చిపోవడంగాయాలతో ఇబ్బంది పడటం కాదు. ఇంద్ర నారాయణ దేవాలయం హిందువులపై జరిగిన హింసకు ఒక సజీవ తార్కాణం. నాటి ఇస్లాం పాలకుడు తుగ్లక్ తమ  సంస్కృతిని, నమ్మకాలను ధ్వంసం చేశాడని తెలంగాణ  హిందువులు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. ఇతర మతస్తుల  పై దాడి చేసి నిర్మించిన కట్టడాలు పవిత్రమైనవి కాదని ముస్లిం సమాజం సైతం గుర్తించాలిఇతర మతస్తుల దేవాలయాలను ధ్వంసం చేసి, ఆక్రమించే కార్యకలాపాల సమర్థన కొనసాగించడం  ముస్లిం సమాజానికి శ్రేయస్కరం కాదు.

విషయంలో తెలంగాణ   ప్రజలకు  ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఏమీ లేదు, తెలంగాణ హిందువులపై తరతరాలుగా జరిగిన  హింస, అసహనం  కొనసాగించడం తప్ప

Leave a Reply